అమరావతినరహరి వరప్రసాద్ రాష్ట్ర... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-17) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-17 11:12:00

అమరావతి


నరహరి వరప్రసాద్ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు


పది లక్షలిస్తానని చెప్పి, వరదల పాలు చేశాడు


గోదావరి వరద ఉధృతితో పోలవరం ముంపు ప్రాంతాల్లోని గిరిజనులు తిండితిప్పలు లేకుండా అల్లాడుతున్నారు.


చలికి వణుకుతూ, చెట్లపైకెక్కి ప్రాణాలు కాపాడుకునే దుస్థితికి వారు దిగజారినా జగన్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహయక చర్యలు చేపట్టలేదు.


ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద రూ.10లక్షలిస్తానని చెప్పిన జగన్, ఇంతవరకు ఇవ్వలేదు.


కేంద్ర ప్రభుత్వ బలగాల సాయంతో రాష్ట్రప్రభుత్వం వారిని తక్షణమే కాపాడాలి.


తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన ఆర్థికసాయాన్ని అవహేళన చేసిన జగన్, రూ.10లక్షలిస్తానని చెప్పి వారిని మోసగించాడు.


వరదల పాలైన ప్రతి కుటుంబానికి వెంటనే రూ.10వేలు చెల్లించాలి.


HMTV

HMTV

Next Story