బీజేపీ మీడియా స్టేట్మెంట్.కె... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-13) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-13 10:29:11

బీజేపీ మీడియా స్టేట్మెంట్.


కె కృష్ణసాగర రావు


బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి,


ప్రధాన మంత్రి ప్రారంభించిన కొత్త పన్ను సంస్కరణలను బీజేపీ హృదయ పూర్వకంగా స్వాగతిస్తోంది. ఇంత కష్ఠకాలంలో కూడా భారీ సంస్కరణలు చేపట్టడం ద్వారా, రిఫామ్, పెర్ఫామ్, ట్రాన్స్ఫామ్ (సంస్కరణ, సమర్థ పనితీరు, మార్పు) అనే తన అజెండాను అమలు చేసింది మా జాతీయ ప్రభుత్వం.


'నిజాయితీగా ఉన్న వారిని గౌరవించడం' అనేది ఈ కొత్త పన్ను విధానం. పన్నులు నిజాయితీగా చెల్లించే వారికి ఏ సంస్థల నుంచీ వేధింపుల భయం ఉండదు ఈ కొత్త విధానం వల్ల. నిజాయితీగా పన్ను చెల్లించేవారికి మరింత సౌకర్యం, లాభాలు అందిస్తోంది కొత్త విధానం. వివాదాల్లో మానవ జోక్యం లేకుండా, విచారణ, అప్పీలుకు అవకాశం కల్పించారు.


ఈ కొత్త సంస్కరణలు తక్షణం అమల్లోకి వస్తాయి. ఇప్పటికే కార్పొరేట్ పన్ను తగ్గించి, డివిడెండ్ పంపిణీ పన్ను రద్దు చేయగా, ఇది వాటికి కొనసాగింపు.


ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష, పరోక్ష పన్నుల్లో వేగంగా సంస్కరణలు చేయడాన్ని బీజేపీ అభినందిస్తోంది.


HMTV

HMTV

Next Story