HRC కి ఫిర్యాదు చేసిన... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-10) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-10 09:30:06

HRC కి ఫిర్యాదు చేసిన కౌన్సలర్...


మహబూబాబాద్ జిల్లా ఎమ్మార్వో, మున్సిపల్ ,పోలీస్ అధికారుల నుండి ప్రాణహాని ఉందని మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు..


అక్రమకేసులు పెట్టి వేధిస్తున్నారని ఫిర్యాదు..


తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ క్ ఫిర్యాదు చేసిన మహబూబాబాద్ 8వ వార్డు కౌన్సలర్ బానోతు రవి.


గత జనవరిలో జరిగిన మహబూబాబాద్ మున్సిపల్ లో ఇండిపెండెంట్ గా రాష్ట్రంలో గెలుపొందిన రవి


ప్రభుత్వ భూమిలో 5సంవత్సరాలుగా ఇల్లు నిర్మించుకొని ఉన్న తన వార్డుల్లోని ప్రజల ఇల్లు కులగొట్టిన కేసులో తన పేరు పెట్టిన అధికారులు..


సంఘటన జరిగినప్పుడు నేను హైద్రాబాద్ లో ఉన్నటువంటి అన్ని ఆధారాలు చూపిన తనపై కక్షపూర్వకంగా కేసులుపెట్టి బెదిరింపులకు గురిచేస్తున్నారని తెలిపిన రవి..


చంపుతామని బెదిరిస్తున్నారని తన గోడును వెళ్లబోసుకున్న రవి..


తనకు జరిగిన అన్యాయానికి బాద్యులైన పలువురు ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకొవాలని కోరిన రవి..


తమపై పెట్టిన కేసులు రద్దు చేయించే విధంగా చర్యలు తీసుకోగలరని రాష్ట్ర మానవహక్కుల కమిషన్ ను కోరిన రవి.


HMTV

HMTV

Next Story