అమరావతి: కళా వెంకట్రావు... ... Live Updates:ఈరోజు (ఆగస్టు-04)ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-04 05:39:40

అమరావతి: కళా వెంకట్రావు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు

ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు మృతి కలిచివేసింది. ఉత్తరాంధ్ర జానపదాలకు గజ్జెకట్టి పల్లెకారులతో పాటు గిరిజనులనూ చైతన్యపరిచిన ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు మృతి దిగ్బ్రంతికి గురి చేసింది. ఏం పిల్లడో ఎల్దమొస్తవ పాటతో ప్రఖ్యాతి చెందారు. వందలాది జానపదపాటలను రచించి విప్లవకవిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరొందారు. అర్థరాత్రి స్వతంత్య్రంతో సినిమాతో ఆయన సినీ ప్రస్థానం మొదలు పెట్టారు. 1972లో జననాట్య మండలిని స్థాపించారు. 2017లో కళారత్న పురస్కారం అందుకున్న ఆయన అకాల మరణం చెందటం కలిచివేసింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.


HMTV

HMTV

Next Story