రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్..తెలంగాణ రాష్ట్ర... ... Live Updates:ఈరోజు (జూలై-30) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-07-30 11:29:30

రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో మానవ అక్రమ రవాణా అడ్డుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాం..

మహిళలను, చిన్నారులను అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం..

రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన ఈ బృందం అన్ని పోలీస్ స్టేషన్ లను కోఆర్డినేషన్ చేస్తుంది..

మహిళల అక్రమ రవాణా, చిన్న పిల్లల కిడ్నాప్, కిడ్నీ రాకెట్, అనాధ పిల్లలను పనిలో పెట్టుకోవడం లాంటి వాటిపై ఈ బృందం ప్రత్యేక నిఘా పెడుతుంది...

గడిచిన సంవత్సర కాలం వరకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో మహిళల అక్రమ రవాణా కు సంబంధించి 290 కేసులను నమోదు చేశాం..

ఇందులో 557 మందిని అరెస్టు చేసి జైలుకు పంపించారు

మంది మహిళలకు చిన్నారులను విముక్తి కల్పించారు..

144 వ్యభిచార గృహాలపై కేసులు నమోదు చేశాం..

50 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశాం..

ఇకనుండి రాచకొండ కమిషనరేట్ లో అక్రమ రవాణాపై ఏమైనా ఫిర్యాదులు ఉంటే డయల్100కు సమాచారం ఇవ్వండి.

HMTV

HMTV

Next Story