బండి సంజయ్.. బీజేపీ రాష్ట్ర... ... Live Updates:ఈరోజు (జూలై-29) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

బండి సంజయ్.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి జన్మభూమి అయోధ్యలో, భవ్య రామ మందిర నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో ప్రధానిపై అసదుద్దీన్ ఓవైసీ చవకబారు విమర్శలు చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తున్నాం. హైదరాబాద్ ఎంపీ, అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయి.

అన్ని మతాలను సమానంగా గౌరవించడమే సెక్యులరిజం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల ఆకాంక్ష మేరకు, ప్రధాని రామమందిర శంకుస్థాపనకు వస్తున్నారు. ఈ ఆలయం కేవలం హిందూ మతస్తులకు చెందింది కాదు, ఇది భారతీయుల ఆలయం. కోట్లాది మంది ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించిన ఈ మహాయజ్ఞ ప్రారంభ కార్యక్రమంలో, ప్రధానిగా నరేంద్రమోదీ పాల్గొనడం, భారతీయులందరికీ గర్వకారణం.

400 ఏళ్లుగా అయోధ్యలో ఉన్న బాబ్రీ మసీదు ఉంది అనడం, నిజమైతే మరీ అంతకుముందు వేల ఏళ్లుగా అక్కడ ఉన్న శ్రీ రామ మందిరంను మరి ఎవరు ధ్వంసం చేశారు..?

సుప్రీం కోర్టు తీర్పు తదనంతరం, భారత ప్రభుత్వం కోర్టుకు నివేదించిన మేరకు, ఎటువంటి సమస్యలు లేకుండా, అందరిని కలుపుకుంటూ, ఆమోదయోగ్యంగా, శాంతియుతంగా ఈ ఆలయ నిర్మాణం జరుగుతున్నది.

Show Full Article
Print Article
Next Story
More Stories