సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ... ... Live Updates:ఈరోజు (జూలై-29) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-07-29 10:46:20

 సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా కు సిద్ధమవుతున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కరోనా లక్షణాలతో బాధపడుతున్న సంగారెడ్డి పట్టణానికి చెందిన ఒక మహిళ ను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేసుకునేందుకు నిరాకరించి గాంధీకి పంపిన వైద్యులు. వైద్యం నిరాకరించిన వైనం పై సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి సుపెరిండెంట్ పై నిన్న ఆగ్రహం వ్యక్తం చేసిన జగ్గారెడ్డి. గాంధీలో చికిత్స పొందుతూ ఆ మహిళ మృతి చెందడం తో ఆందోళనకు సిద్ధమైన జగ్గారెడ్డి. జగ్గారెడ్డి ఆందోళనకు పిలుపునివ్వడం తో సంగారెడ్డి లో ఉద్రిక్తత.

HMTV

HMTV

Next Story