కాకినాడలో మళ్లీ లాక్ డౌన్..ప్రజలు సహకరించాలి:... ... Live Updates:ఈరోజు (జూన్-24) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-06-24 08:08:55

కాకినాడలో మళ్లీ లాక్ డౌన్..ప్రజలు సహకరించాలి: మేయర్ పావని


- ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు నమోదవుతున్నందున ప్రజలంతా ప్రభుత్వ నిబంధనలు పాటించి లాక్ డౌన్ కు సహకరించాలని కాకినాడ నగర మేయర్ సుంకర పావనీ తిరుమల కుమార్ అన్నారు. నగర పాలక సంస్థ లోని మేయర్ చాంబరులో ఆమె విలేకరులతో మాట్లాడారు. కాకినాడ లో కేసులు అధికం అవుతున్నందున ఈనెల 25 నుండి తిరిగి లాక్ డౌన్ మొదలవుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పని ఉంటేనే బయటకు రావాలని, లేనిపక్షంలో ఇంటికే పరిమితం కావాలన్నారు. ఆరోగ్యం తో ఉంటేనే ఇతర కార్యకలాపాలకు అవకాశం ఉంటుందని, ప్రభుత్వ ఆదేశాలు పాటిద్దామని సూచించారు. కరోనా నేపథ్యంలో తమ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది బాగా పనిచేశారని కొనియాడారు.

HMTV

HMTV

Next Story