♦♦ బ్లేడ్ బ్యాచ్ అరెస్టు ♦♦-ప్రజలను భయభ్రాంతులకు... ... Live Updates:ఈరోజు (జూన్-20) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-06-20 13:45:38

♦♦ బ్లేడ్ బ్యాచ్ అరెస్టు ♦♦

-ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న బ్లేడ్ బ్యాచ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లాలోని గూడవల్లి గ్రామ సమీపంలో బ్లేడ్‌ బ్యాచ్‌ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితం లారీ డ్రైవర్‌పై బ్లేడ్‌ బ్యాచ్‌ దాడి చేసిందని పోలీసులు చెప్పారు. ఏలూరు నుంచి వస్తున్న నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి బ్లేడ్లు, బైక్‌, 4 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితులంతా విజయవాడకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు

HMTV

HMTV

Next Story