-» జాతీయ అఖిలపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్... ... Live Updates:ఈరోజు (జూన్-19) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

-» జాతీయ అఖిలపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

- 20 మంది వీర సైనికుల మరణం పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తంచేస్తున్నా

- వారి త్యాగాలకు సెల్యూట్‌ చేస్తున్నా

- వారి కుటుంబాలకు తోడుగా నిలవాల్సిన అవసరం ఉంది

- అణ్వాయుధాలున్న ఈ రోజుల్లో సంప్రదాయ యుద్ధం కాకుండా దౌత్యం, వ్యాపార, ఆర్థిక ఆంక్షలు, అంతర్జాతీయ ఒత్తిడి ద్వారా వివిధరకాలుగా   యుద్ధంచేయొచ్చు:

- భారత్‌ను ఆర్థికంగా, దౌత్యపరంగా శక్తివంతమైన దేశంగా మార్చడానికి 2014 నుంచి ప్రధాని మోదీ కృషిచేస్తున్నారు

- ప్రధాని విజయవంతమైన విదేశీ విధానాల ద్వారా 3 రకాల ఇంటర్నేషనల్‌ కంట్రోల్‌ రిజైమ్స్‌లో భారత్‌ చోటు సాధించింది

- మిసైల్స్, ఆర్మ్స్‌ అండ్‌ బయోవెపన్స్, వెసెనర్‌ అగ్రిమెంట్, ఆస్ట్రేలియా గ్రూపులో భారత్‌ చోటు సాధించింది

- 192 సభ్యదేశాలున్న ఐక్య రాజ్యసమితిలో భారత్‌ 184 మంది సభ్యుల మద్దతుతో భద్రతామండలిలో సభ్యదేశంగా ఎంపికైంది

- గ్లోబల్‌ స్టేట్స్‌మన్‌గా ప్రధాని సాధించిన విజయాలు ఒకవైపు అయితే మరోవైపు పరోక్షంగా భారత్‌ను అస్థిరపరచాలని మరోవైపు ప్రయత్నాలు చేస్తున్నారు.

- ప్రధాని మోదీ నేతృత్వంలో పుల్వామా, డోక్లాం అంశాల విషయాల్లో అలాగే మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తింపచేయడంలో విజయాలు  సాధించాం

- కులభూషన్‌ జాదవ్‌ కేసులో 15–1 ఓట్ల తేడాతో అంతర్జాతీయ కోర్టులో విజయం సాధించాం

- ఈ పరీక్ష సమయంలో వైయస్సార్‌సీపీ అధ్యక్షుడిగానే కాదు, ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ వెనుక ఉన్నాం,

- మా రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలుకూడా మనస్ఫూర్తిగా మద్దతు తెలుపుతున్నాం

- గాల్వాన్‌ సంక్షోభంలో ఈ దేశాన్ని మీరు సరైన మార్గంలో విజయవంతంగా నడిపిస్తారని నమ్ముతున్నాం

- ఈ సంక్షోభం సమయంలో ఏ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నా దానికి మేం కట్టుబడి ఉంటాం

Show Full Article
Print Article
Next Story
More Stories