- సిఎం కేసీఆర్; రాబోయే రోజుల్లో కాళేశ్వరం,... ... Live Updates:ఈరోజు (జూన్-15) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

- సిఎం కేసీఆర్;  రాబోయే రోజుల్లో కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులు పూర్తయి కోటి 30 లక్షల ఎకరాలలో బంగారు పంటలు పండించే దిశగా తెలంగాణ పురోగమిస్తున్నది.

- ఇబ్బడిముబ్బడిగా ధాన్యం ఉత్పత్తి కాబోతున్న నేపథ్యంలో రాబోయే పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నియంత్రిత పంటల సాగు విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది

- ఈ విధానం తెలంగాణ వ్యవసాయ రంగంలో చేయబోయే ఉజ్వల ప్రస్థానానికి నాంది పలుకుతుంది.

- గతంలో పంజాబ్ రాష్ట్రం వ్యవసాయరంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించి, దేశంలోనే ప్రథమ స్థానాన్ని సాధించింది.

- అయితే పంటల మార్పిడి విధానం అవలంబించకపోవడంవల్ల పంజాబ్ లో వ్యవసాయ వైపరీత్యం (పంజాబ్ డిజాస్టర్) సంభవించింది.

- పంజాబ్ అనుభవం ద్వారా వచ్చిన గుణపాఠాలను అధ్యయనం చేసిన రాష్ట్ర ప్రభుత్వం అటువంటి సమస్యలేవీ తెలంగాణలో ఉత్పన్నం కాకుండా ఉండేవిధంగా నియంత్రిత సాగు విధానానికి రూపకల్పన చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories