టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు... ... Live Updates:ఈరోజు (జూన్-13) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-06-13 12:23:28

టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు కామెంట్స్..

అచ్చెన్నాయుడు అరెస్టు దుర్మార్గం..

శాస్త్ర చికిత్స చేయించుకున్న వ్యక్తిని ఇంత అమానుషంగా అరెస్టు చేయాల్సిన అవసరం ఏముంది..

కక్ష కార్పున్యాలతో నడుస్తున్న ప్రభుత్వం ఇది..

ప్రజా సమస్యలు, రాష్ట్ర అభివృద్ధి పైన ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు..

రాష్ట్రం ఏమైపోతుందో అనే ఆవేదన ప్రజల్లో మొదలయ్యింది..

ఏడాది కాలం ప్రతిపక్షాలను వేధించడానికే ఉపయోగించారు..

గ్రామాల్లో ముఠా తగాదాలు మాదిరిగా రాష్ట్రాన్ని తయారు చేయాలని జగన్ నిర్ణయించుకున్నారు..

రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రావాట్లేదు..

భవిష్యత్తులో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే పరిస్థితి కనబడట్లేదు..

ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం ఎత్తిన వారిని కేసులతో భయపెట్టాలని చూస్తున్నారు..

సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని అన్యాయంగా కేసుల పేరుతో వేధిస్తున్నారు..

HMTV

HMTV

Next Story