గాంధీ హాస్పిటల్ సమ్మె విరమించి విధులకు హాజరైన... ... Live Updates:ఈరోజు (జూన్-12) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-06-12 03:19:52

గాంధీ హాస్పిటల్ సమ్మె విరమించి విధులకు హాజరైన జూడాలు.

గాంధీ ఆసుపత్రి లో జూనియర్‌ డాక్టర్స్ సమ్మె విరమించారు.

తక్షణమే విధుల్లో చేరుతున్నట్లు జూనియర్‌ డాక్టర్లు ప్రకటించారు.

రోగి బంధువులు వైద్యుడిపై దాడికి పాల్పడటంతో మంగళవారం రాత్రి నుంచి జూడాలు విధులను బహిష్కరించారు.

జూడాలతో రెండుసార్లు తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్‌ చర్చలు జరిపారు.

తమ డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం తో విధులకు హాజరవుతున్నామని జూడాలు ప్రకటించారు.

HMTV

HMTV

Next Story