Bhupalpally updates: తృటిలో తప్పిన ప్రమాదం!

HMTV
By HMTV
Published on: 2020-10-15 06:10:13

జయశంకర్ భూపాలపల్లి జిల్లా.

-జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీంకి తృటిలో తప్పిన ప్రమాదం

-రేగొండ మండలంలో రైతు వేదికల నిర్మాణ పనులను పరిశీలించేందుకు భూపాలపల్లి జిల్లా కేంద్రం నుంచి రేగొండకు ప్రభుత్వ వాహనంలో బయలుదేరిన జిల్లా కలెక్టర్ గారి వాహనానికి రేగొండ మండలం రామన్నగూడెంతండా సమీపంలో ప్రధాన రోడ్డుపై సడన్ గా ద్విచక్ర వాహనదారుడు అడ్డు రావడంతో కలెక్టర్ వాహనం డ్రైవర్ అప్రమత్తమై అతన్నీ తప్పించే ఉద్దేశంతో వాహనానికి బ్రేక్ వేస్తూ రోడ్డు కిందికి తీసుకు వెళ్ళాడు.

-దానితో వాహనదారుడు మరియు కలెక్టర్ తో సహా కలెక్టర్ ప్రయాణిస్తున్న సిబ్బంది అందరూ సురక్షితంగా బయట పడ్డారు.

-ప్రమాదం జరిగితే వాహనదారునికి లేదా కలెక్టర్ వాహనం అదుపుతప్పి పడిపోతే కలెక్టర్ గారికి ప్రాణహాని జరిగేది.

-కలెక్టర్ డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం నివారించబడింది. వెంటనే రేగొండ పోలీసులకు సమాచారం అందించగా స్పందించిన పోలీసులు వాహనదారులను అదుపులోకి తీసుకున్నారు.

HMTV

HMTV

Next Story