Andhra Pradesh Panchayat Elections 2021 Phase 3 Polling
శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం అంపిలిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ మద్దతుదారు గండి రామినాయుడును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకే రామినాయుడును గృహానిర్బంధం చేసినట్టు పోలీసులు తెలిపారు. అయితే వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వర రావును పోలింగ్ కేంద్రం వద్దకు అనుమతించారు. దీంతో పోలీసుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, గ్రామస్తుల మధ్య తోపులాట జరిగింది.
Next Story



