Andhra Pradesh Bandh Live Updates: కాకినాడ
కాకినాడ:
ఏపీ వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కాకినాడ పోర్టు ఎదురుగా వామపక్షాలు, కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలను ఒక్కొక్కటిగా ప్రైవేట్‌పరం చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మోడీ. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు వామపక్ష నాయకులు.
Next Story



