Top
logo

70 లీటర్ల సారా స్వాధీనం.. నలుగురి అరెస్ట్

Highlights

కోరుకొండ : కోరుకొండ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో నిర్వహించిన తనిఖీలలో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారినుండి 70...

కోరుకొండ : కోరుకొండ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో నిర్వహించిన తనిఖీలలో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారినుండి 70 లీటర్ల సారా, రెండు మోటార్ సైకిళ్ళు స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కోలా వీరబాబు తెలియజేశారు. ఈ కేసుకు సంబంధించి నిందితులు కోరుకొండ గ్రామానికి చెందిన శివ గంగాధర్, కోటి కేశవరం గ్రామానికి చెందిన రాజ్ కుమార్, తిరుమలాయపాలెం గ్రామానికి చెందిన చిన్నబాబు శ్రీనులను అరెస్ట్ చేసినట్లు తెలియజేశారు.

సారా అమ్మకాలు జరగడం ద్వారా కరోనా వైరస్ కూడా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని సారా అమ్మకాలపై ప్రజలు సమాచారం అందించాలని సిఐ సూచించారు. ఈ దాడులలో ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.



Next Story