కరీంనగర్ లో ఎన్టీఆర్ 97 వ జయంతి వేడుకలు

HMTV
By HMTV
Published on: 2020-05-28 06:06:41

కరీంనగర్ టౌన్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను, కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన పార్లమెంటరీ అధ్యక్షులు అంబటి జోజి రెడ్డి. అనంతరం వారు మాట్లాడుతూ... ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు పనిచేశారని కొనియాడారు. నాడు పేదలకోసం రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి, ఎంతోమంది పేదల కడుపులు నింపారని అన్నారు. ఆయన పెట్టిన మహానాడు ఇప్పటికి కూడా నడుస్తుందని, 38వ మహానాడు కార్యక్రమాన్ని కరీంనగర్ లో నిర్వహిస్తున్నామని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీకి గట్టిపోటీని ఇచ్చి, ప్రజలకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని ఆయన అన్నారు. ఎక్కడ అన్యాయం జరిగినా న్యాయం జరిగే వరకూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిలదీసి న్యాయం జరిగే వరకూ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.



 


HMTV

HMTV

Next Story