Top
logo

వీఎం ఆర్డీఏలో మరో 13 మండలాలు విలీనం

Highlights

విశాఖ మెట్రో రీజియన్ డవలప్ మెంట్ అధారిటీ (VMRDA)లో విశాఖ జిల్లాలోని మరో 13 మండలాలను కలిపేందుకు మున్సిపల్ అండ్...

విశాఖ మెట్రో రీజియన్ డవలప్ మెంట్ అధారిటీ (VMRDA)లో విశాఖ జిల్లాలోని మరో 13 మండలాలను కలిపేందుకు మున్సిపల్ అండ్ అర్భన్ డవలప్ మెంట్ కు ప్రతిపాదనలు పంపినట్టు VMRDA చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ చెప్పారు. పాయకరావుపేట నియోజకవర్గంలో ఒక మండలం, నర్సీపట్నంలో నాలుగు, చోడవరంలో నాలుగు, మాడుగులలో నాలుగు మండలాలకు విస్తరించేందుకు ప్రతిపాదనలు పంపామన్నారు. ప్రభుత్వ ఆదేశాను సారం ఇది విలీనమైతే వీఎం ఆర్డీఏ నిబంధనలకు అనుగుణంగా సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన చెప్పారు.Next Story