ఏపీలో అసమర్థ పాలన నడుస్తోంది: ఎమ్మెల్సీ మాధవ్

HMTV
By HMTV
Published on: 2020-06-08 11:25:34

విశాఖపట్నం: రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఉన్న ఇసుక సంక్షోభం కొనసాగుతోందని ఎమ్మెల్సీ మాధవ్ వ్యాఖ్యానించారు. విశాఖలో ఉన్న యాడ్లలో ఇసుక దొరకడం లేదన్న ఆన్‌లైన్ మొత్తం మాఫియా చేతిలో ఉందని విమర్శించారు. ఆన్‌లైన్ తెరిచినా ఉపయోగం లేదని... అందులో ఇసుక ఉండాలి కదా అని ఎద్దేవా చేశారు. భవన నిర్మాణ కార్మికులు కాంట్రాక్ట్‌లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వైసీపీ, టీడీపీ ప్రభుత్వం మధ్య వ్యత్యాసం లేదని... ఏపీలో అసమర్థ పాలన నడుస్తుందని విమర్శించారు. రెండు పార్టీల వ్యాపార దృక్పథం, రాష్ట్ర ప్రజల తరఫున ఆలోచించడం లేదన్నారు. మద్యనిషేధం పేరుతో రకరకాల బ్రాండ్ తీసుకొచ్చి అమ్ముతున్నారని ఎమ్మెల్సీ మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 



 

 

HMTV

HMTV

Next Story