చోడవరం స్వయంభూ ఆలయాలలో దర్శనాలు

HMTV
By HMTV
Published on: 2020-06-08 10:08:24

చోడవరం: రెండు స్వయంభూ ఆలయాలైన గౌరీశ్వర, వినాయక ఆలయాలను ప్రాత:కాలాన్నే తెరిచారు. శానిటైజర్ ఏర్పాట్లు చేశారు. భక్తులను థర్మోస్కానింగ్ చేసి మరీ ఆలయ ప్రవేశం కల్పించారు. దేవాదాయ శాఖ కార్యనిర్వాహక అధికారులు ట్రస్టు బోర్డు ప్రతిపాదిత ఛైర్మన్లు, సభ్యులు ఆయా ఆలయాల్లో ప్రథమ పూజలు చేశారు. దర్శనానికి వచ్చే భక్తులకు బౌతిక దూరం పాటించే విధంగా ఏర్పాట్లు చేశారు. రెండున్నర నెలల తర్వాత ఆలయాల ప్రవేశం కల్పించడంపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 



 


HMTV

HMTV

Next Story