కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్‌గా ఎ.పరమేశం

HMTV
By HMTV
Published on: 2020-06-02 17:01:44

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్‌గా ఎ.పరమేశంను నియమిస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు

▪ప్రస్తుతం ఆయన కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. కృష్ణా బోర్డు చైర్మన్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఆర్కే గుప్తాకు కేంద్రం పదోన్నతి కల్పించి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సభ్యునిగా నవంబర్ 30న నియమించిన విషయం తెలిసిందే. అలాగే పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవోగా పనిచేస్తున్న ఆర్కే జైన్‌కు కేంద్రం పదోన్నతి కల్పించి సీడబ్ల్యూసీ చైర్మన్‌గా నియమించింది. ఈ నేపథ్యంలో కృష్ణా బోర్డు చైర్మన్, పీపీఏ సీఈవో బాధ్యతలను కూడా గోదావరి బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నిర్వహిస్తూ వస్తున్నారు.

HMTV

HMTV

Next Story