హైదరాబాద్ కూకట్‌పల్లి ఎస్‌బీఐ బ్యాంక్‌లో అగ్నిప్రమాదం

HMTV
By HMTV
Published on: 2020-06-02 11:26:19

హైదరాబాద్..కూకట్‌పల్లి భాగ్యనగర్ కాలనీలోని ఎస్‌బీఐ బ్యాంక్‌లో స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. బ్యాంక్‌లో మంటలు చెలరేగడంతో సిబ్బంది అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఏసీలో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్నిప్రమాదం జరిగింది. సిబ్బందికి కానీ, కస్టమర్లకు కానీ ఎవరికి ఎటువంటి హాని జరగలేదని బ్యాంక్ సిబ్బంది తెలిపారు. నష్టం అంచనా వేయటానికి ప్రత్యేక బృందం వస్తుందని సిబ్బంది తెలిపారు.

HMTV

HMTV

Next Story