రాత్రంతా వాన..ఈరోజు, రేపు ఇదే పరిస్థితి

HMTV
By HMTV
Published on: 2020-06-01 01:22:15

తెలంగాణలో నిన్న రాత్రంతా వర్షం కురుస్తూనే వుంది

హైదరాబాద్ లో నిన్న మధ్యాహ్నం ప్రారంభమైన వర్షం ఈ ఉదయానికి కొనసాగుతూనే ఉంది.

కొంతకాలంగా ఎండ వేడిమికి అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం లభించింది.

ఉపరితల ద్రోణి కారణంగా నిన్న రాత్రి వరకు రాష్ట్రవ్యాప్తంగా 382 ప్రాంతాల్లో వర్షాలు కురిసినట్టు వాతావరణ విభాగం అధికారులు తెలిపారు.

పిడుగులు పడి వేర్వేరు చోట్ల ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.

ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

ఈరోజు, రేపు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

HMTV

HMTV

Next Story