సినిమాటోగ్రాఫర్ శ్యాం కె నాయుడుపై కేసు నమోదు

HMTV
By HMTV
Published on: 2020-05-27 09:49:29

తెలుగు సినిమా ఇండస్ట్రీలో శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. పోకిరి, బిజినెస్ మెన్, కెమెరామెన్ గంగతో రాంబాబు తో పాటు అనేక సినిమాలకు ఆయన సినిమాటోగ్రఫీ అందించారు. శ్యామ్ కె నాయుడు ప్కూరఖ్డాయాత సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు తమ్ముడు. 

కాగా, ఇప్పుడు ఆయనపై ఎస్ఆర్  నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.  తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసాడని చెప్పి సినీ ఆర్టిస్ట్ సాయి సుధా కేసు ఫైల్ చేసింది.  దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.  ప్రస్తుతం కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

HMTV

HMTV

Next Story