సింహగిరిపై ఉద్యానవనం అభివృద్ధికి శ్రీకారం

HMTV
By HMTV
Published on: 2020-05-25 02:42:15

సింహాచలం: సింహగిరిపై స్వామివారి ప్రధాన ఆలయం వెనుక కొండవాలు ప్రాంతంలో ‘శ్రీస్వామి వారి ఉద్యానవనం’ పేరిట దేవతా వృక్షాల వనాన్ని అభివృద్ధి చేయనున్నట్లు ఈవో ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. ఇందుకు సంబంధించిన పనులను ఆయన ప్రారంభించారు. హిల్‌టాప్‌ రహదారిలో దశాబ్దకాలంగా నిరుపయోగంగా మారిన అతిథి గృహాలను తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చే క్రమంలో ఈ పనులు చేపట్టామన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతాన్ని చదును చేసి తుప్పలు, పిచ్చిమొక్కలు తొలగించామన్నారు. చదును చేసిన ప్రాంతంలో సుమారు 15వేల సంపెంగ, శ్రీచందనం, మారేడు, నేరేడు, పనస, వేప, జువ్వి, రావి వంటి దేవతా వృక్షాలను పెంచుతామన్నారు. కరోనా కారణంగా నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించామన్నారు.


 

HMTV

HMTV

Next Story