ఆయన మరణం దేశానికి తీరని లోటు: -మంత్రి జగదీష్ రెడ్డి

HMTV
By HMTV
Published on: 2020-08-31 14:24:48

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం దేశానికి తీరని లోటు అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.

ఆయన మరణం పట్ల ఆయన సంతాపం ప్రకటించారు.

తెలంగాణ సమాజం ప్రణబ్ ముఖర్జీని ఎప్పటికీ గుర్తుఉంచుకుంటుందని ఆయన చెప్పారు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు అప్పటి యూ పి ఏ ప్రభుత్వం వేసిన కమిటీకి ప్రణబ్ ముఖర్జీ యే చైర్మన్ అని ఆయన గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్రం బిల్లు ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి గా ఉన్నప్పుడే ఉభయ సభల్లో ఆమోదం పొందిందని ఆయన అన్నారు. అటువంటి మహానేత మరణంతో ఏర్పడ్డ లోటు పూడ్చలేనిదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.

HMTV

HMTV

Next Story