రాయలసీమ ఎత్తిపోతలపై హైకోర్టు విచారణ

HMTV
By HMTV
Published on: 2020-08-19 07:19:18

టిఎస్ హైకోర్టు: రాయలసీమ ఎత్తిపోతల పథకం పై విచారణ చేపట్టేందుకు అంగీకరించిన తెలంగాణ హైకోర్టు.

సోమవారం వంశీ చంద్ రెడ్డి, గవినోళ్ల శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్లు లిస్ట్ చేసేందుకు అంగీకరించిన జస్టిస్ ఎంఎస్ రామచందర్ రావు నేతృత్వంలోని బెంచ్

కేంద్ర ప్రభుత్వం, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆదేశించిన ఎపి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది బెంచ్ కు వివరించిన పిటిషనర్ల తరఫు న్యాయవాది.

ఎపి పునర్విభజన చట్టం సెక్షన్ 84కు విరుద్ధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపడుతున్నారని పిటిషనర్ న్యాయవాది శ్రావణ్ కుమార్ వివరించారు.

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టు లో పిటిషన్ వేసిందని, శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

సుప్రీంకోర్టు విచారణ తర్వాత సోమవారం విచారణ చేపట్టాలని ఎపి న్యాయవాది కోరారు.

దీంతో కేసును సోమవారం 24.8.2020 లిస్ట్ చేసేందుకు హైకోర్టు అంగీకరించింది.

HMTV

HMTV

Next Story