వర్షాలపై కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష

HMTV
By HMTV
Published on: 2020-08-17 04:07:15

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష.

మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రగతిభావన్ లో పరిస్థితి ని సమీక్షించనున్న సీఎం.

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

జిల్లాల వారిగా సమాచారం తెలుసుకొని తీసుకోవలసిన చర్యల పై ఆదేశాలు , సూచనలు చేస్తున్నారు.

ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల అక్కడక్కడ ఇబంధికర పరిస్థితులు నెలకొన్నాయి.

రాబోయే మూడు , నాలుగు రోజులు రాష్ట్రంలో భారీ నుండి అతిభారి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

భారీ వర్షాల పై సమీక్షించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యాహ్నం ఒంటి గంటకు అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పటు చేశారు.

ఇప్పటికే అన్ని జిల్లాల వ్యాప్తంగా అధికారులను సీఎం అప్రమత్తం చేశారు.

అవసరమైన చోట సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

HMTV

HMTV

Next Story