అనేక రంగాల్లో తెలంగాణ దేశానికే ఆద‌ర్శం: మ‌ంత్రి ఈటెల‌

HMTV
By HMTV
Published on: 2020-08-15 07:57:36

పెద్దపల్లి జిల్లా : జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ...

మినిస్టర్ కామెంట్స్ :  యావత్ ప్రజానీకానికి స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు.

ఎంతోమంది మహనీయుల త్యాగఫలం మన స్వాతంత్య్రం.

భారతావని విముక్తికోసం అమరులైన వారందరికీ నివాళులు అర్పిస్తున్నాము.

రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ అతి తక్కువ కాలంలో దేశంలో ఒక రోల్ మోడల్ గా నిలిచింది.

అనేక రంగాల్లో దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచింది.

ఆనాడు ఏ నీళ్ళ కోసం కొట్లాడినమో, ఏ కరెంటు లేక అత్మహత్యలు చేసుకున్నమో, పేదరికంతో పల్లెలు పట్టణాలు తల్లడిల్లామో వాటికి చరమగీతం పాడాం ..

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అతి సంపన్నమైన ప్రాంతం పెద్దపల్లి.

గొప్పగా విలసిల్లుతున్న జిల్లా పెద్దపల్లి ...

మేడిగడ్డ , సుందిల్ల, అన్నారం లాంటి ప్రాజెక్టులన్నీ ఈ జిల్లాలోనే ఉన్నాయి. అన్ని రంగాల్లో పెద్దపల్లి జిల్లా ను ముందుకు తీసుకువెళ్ళడానికి కృషి చేస్తాం.

HMTV

HMTV

Next Story