'బాలూ త్వరగా లేచిరా..నీకోసం ఎదురుచూస్తున్నా'...ఇళయరాజా

HMTV
By HMTV
Published on: 2020-08-14 17:50:00

కోవిడ్ బారినపడిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం క్షీణిస్తుంద‌నే వార్తలు రావడంతో  ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా భావోద్వేగానికి లోనయ్యారు.

  బాలు ను ఉద్దేశించి ఆయన ఓ వీడియో సందేశం విడుదల చేశారు.

'బాలూ త్వరగా లేచిరా...నీకోసం వేచున్నా...'అంటూ ఇళయరాజా  పిలుపునిచ్చారు.

 ఇద్దరి మధ్య స్నేహ బంధం సినిమాలకు ముందు నిర్వహించిన మ్యూజికల్ కచేరీల కాలం నుంచే మొదలైయ్యిందని గుర్తుచేశారు.

సంగీతం ఇద్దరికీ జీవితం, జీవనోపాధి అయ్యిందన్నారు. గాత్రం, సంగీతం ఒకటిచేరినట్లే...మన ఇద్దరి మధ్య స్నేహ బంధం కూడా అలాంటిదేనన్నారు.

ఇద్దరి మధ్య కొన్ని విషయాల్లో గొడవలున్నా...మనం ఎప్పటికీ స్నేహితులమేనని...ఆ విషయం మన ఇద్దరికీ తెలుసని ఇళయరాజా పేర్కొన్నారు.

నువ్వు తప్పనిసరిగా తిరిగి వస్తావని...తన అంతరాత్మ చెబుతోందని, అది నిజంకావాలని దేవుణ్ని తాను ప్రార్థిస్తున్నట్లు ఇళయరాజా తన వీడియో సందేశంలో పేర్కొన్నారు.

ఇళయరాజా వీడియో సందేశాన్ని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. 



HMTV

HMTV

Next Story