ఉప్పల్ లో మహిళ దారుణ హత్య

HMTV
By HMTV
Published on: 2020-08-10 04:48:41

ఉప్పల్ పీఎస్ పరిధి చిలకానగర్‌లో రేణుక అనే మహిళను అంజయ్య అనే డ్రైవర్ హత్య చేశాడు.

అంజయ్య, రేణుకల మధ్య ఉన్న వివాహేతర సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది.

అంజయ్య భార్య పుట్టింటికి వెళ్లగా.. నిన్న రాత్రి చిలకానగర్‌లోని అంజయ్య నివాసానికి రేణుక వచ్చింది.

ఈ నేపథ్యంలో రేణుకను అంజయ్యయ హత్య చేశాడు.

రేణుక తలపై బలమైన గాయాలున్నాయి.

హత్యానంతరం అంజయ్య పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హత్యకి గల కారణాలు తెలియాల్సి ఉంది. 

HMTV

HMTV

Next Story