ప్లాస్మా దానానికి ముందుకు వచ్చిన ఎమ్మెల్యే, కలెక్టర్

HMTV
By HMTV
Published on: 2020-08-05 09:26:57

గుంటూరు: కరోనా పాజిటివ్ నుండి బయట పడి ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు వచ్చిన ఎమ్మెల్యే కిలారి రోశయ్య,జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్.

ప్లాస్మా దానం పై అవగాహన కల్పిస్తూ రెడ్ క్రాస్ సొసైటీలో ప్లాస్మా దానం చేస్తూ అంగీకార పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే,జిల్లా కలెక్టర్.

జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ కామెంట్స్...

జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదు కావడమే కాకుండా మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది.

జులై నెలలోనే 170 కరోనా మరణాలు జిల్లాలో నమోదయ్యాయి.

కరోనా మరణాలను తగ్గించేందుకు ప్రభుత్వం ప్లాస్మా డొనేషన్ ను ప్రోత్సహిస్తుంది.

బ్లడ్ బ్యాంక్ లలో ప్లాస్మా సేకరణకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.

సేకరించిన ప్లాస్మాను ప్రత్యేక కమిటీ నిర్ణయించిన వారికి ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం...

HMTV

HMTV

Next Story