చంద్ర‌బాబుపై వైసీపీ ఎమ్మేల్యే ఫైర్‌

HMTV
By HMTV
Published on: 2020-08-05 08:34:06

ప.గో :చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ.

విభజన చట్టంలో పొందుపరిచిన ఏ అంశాన్ని చంద్రబాబునాయుడు ఫుల్ ఫిల్ చేయలేదు.

దీనిలో ఆయన స్వార్థం ఉంది.

శివరామకృష్ణ కమిటీ ని కనీసం పట్టించుకోలేదు.

ఆయన ఒక చక్రవర్తి అని కలగన్నాడు.

రాజధానిలో ఐదు సంవత్సరాల కాలంలో ఏమి నిర్మాణం చేశాడు..?

కపట నాటకానికి, కుట్రపూరిత రాజకీయానికి తెరతీశాడు.

సుమారు రెండు వేల ఎకరాల భూమిని అమ్ముకున్నాడు కానీ ఏ ఒక్క రైతుకు ప్రయోజనం కలగలేదు.

జగన్ పై ఆరోపణలు చేశారు. ఏమాత్రం తప్పు లేదు గనకే విచారణ ఎదుర్కొన్నాడు.

కానీ మీ మీద ఆరోపణ వస్తే 18 కేసుల్లో స్టేలు తెచ్చుకున్నారు.

స్టేలు తెచ్చుకుంటే మీరు నిరపరాధి కాదు.

స్టేలు తెచ్చుకున్నంత మాత్రాన నిజాయితీపరులు కాదు.

అమరావతి భవనాల్లో మీరు చేసిన స్కాం లు సి బి ఐ ఎంక్వయిరీ లో అన్నీ బయటకు వస్తాయి.

కచ్చితంగా వాటిని అనుభవించాలి. అనుభవించే రోజులు వస్తాయి.

న్యాయస్థానాన్ని మభ్యపెట్టి, మేనేజ్ చేసి అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం కోసం చేసే ప్రయత్నం ప్రజాస్వామ్యవాదులు క్షమించరు.


HMTV

HMTV

Next Story