వంగపండు మృతి పట్ల చంద్రబాబు సంతాపం

HMTV
By HMTV
Published on: 2020-08-04 05:01:05

అమరావతి: వంగపండు మృతి పట్ల చంద్రబాబు సంతాపం. ప్రముఖ కవి, గాయకుడు వంగపండు ప్రసాద రావు మృతిపట్ల మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. తన సాహిత్యం ద్వారా తెలుగు ప్రజలను జాగృతం చేశారు. తన గొంతుతో, తన పదాలతో అశేష ప్రజానీకాన్ని ఉర్రూతలూగించారు. ప్రజా చైతన్యానికి ఎనలేని కృషి చేశారు. వంగపండు సాహిత్యం అనేక భాషల్లోకి అనువదించడం తెలుగు జాతికే గర్వకారణం. పీడిత తాడిత ప్రజల హక్కుల సాధన కోసం తన గొంతును, తన సాహిత్యాన్ని అంకితం చేసిన చరితార్ధుడు వంగపండుగా కొనియాడారు. ఆయన మృతి తెలుగు జానపద సాహిత్య లోకానికి తీరని లోటు. వంగపండు అభిమానులకు, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని చంద్రబాబు తెలియజేశారు.


HMTV

HMTV

Next Story