రాజధాని విషయంలో మా జోక్యం ఉండదు.. బిజేపీ నూతన అధ్యక్షుడు వీర్రాజు

HMTV
By HMTV
Published on: 2020-07-31 03:36:06

నాలుగు రోజుల క్రితం బీజేపీ ఏపీ శాఖ నూతన అద్యక్షునిగా నియమితులైన సోము వీర్రాజు రాజధానిపై ఆసక్తి కర ప్రకటన చేశారు. రాజధాని ఏర్పాటులో స్థానికంగా ఉన్న అవసరాలకు అనుగుణంగా ఏర్పాటు చేసుకుంటున్నారన్నారు. దానికి బీజేపీ అడ్డుకాదన్నారు. అయితే అమరావతి రైతులకు అన్యాయం జరిగే విషయంలో న్యాయం జరిగే వరకు తాము పోరాటానికే కట్టుబడి ఉన్నామన్నారు.

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధ్యతలు అనేవి పార్టీ నిర్ణయించే అంశాలని, అందరి సమన్వయంతో పార్టీని విజయవంతంగా ముందుకు నడిపిస్తానని తెలిపారు. 

- పూర్తి వివరాలు 

HMTV

HMTV

Next Story