తెలంగాణ ఏజన్సీలో కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. సరిహద్దుల్లో హై అలర్ట్...

HMTV
By HMTV
Published on: 2020-07-28 05:06:59

వరంగల్: సరిహద్దుల్లో హై అలర్ట్...తెలంగాణ ఏజన్సీలో కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు. నేటి నుండి ఆగస్టు 3వ తేదీ వరకు మావోయిస్టుల అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు. ఘనంగా నిర్వహించాలని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జగన్ పిలుపు. మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో ముందస్తుగా అప్రమత్తమైన పోలీసులు. తెలంగాణా- చత్తీస్ ఘడ్, తెలంగాణా-మహారాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతల్లో కూంబింగ్ ముమ్మరం చేసిన పోలీసులు. అనుమానిత ప్రాంతాల్లో విస్తృతంగా వాహన తనిఖీలు. ఏజన్సీ పోలీస్ స్టేషన్లు కు అదనపు భద్రత మావోయిస్టుల షెల్టర్ జోన్స్ పై పోలీసుల ప్రత్యేక నిఘా. ఇప్పటికే మావోయిస్టు హిట్ లిస్ట్ లో ఉన్న నేతలను మైదాన ప్రాంతాలకు తరలివెళ్లాలని పోలీసుల ఆదేశాలు. టార్గెట్స్ రీచ్ కోసం రంగంలోకి మావోయిస్టు యాక్షన్ టీమ్స్ రంగంలోకి దిగాయని నిఘా వర్గాలకు అందిన సమాచారం. అప్రమత్తమైన ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలపోలీసులు తెలంగాణ ఏజన్సీ ప్రాంతాలన్నింటిని గుపిట్లోకి తీసుకున్న పోలీసు బలగాలు. మావోలు, పొలుసుల చర్య, ప్రతి చర్యలతో బిక్కు, బిక్కు మంటున్న ఏజన్సీ పల్లెలు.



 


HMTV

HMTV

Next Story