కస్తూర్బా విద్యాలయాల్లో ప్రవేశాలకు గడువు పెంపు

HMTV
By HMTV
Published on: 2020-07-24 13:41:52

విశాఖపట్నం: కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో (కేజీబీవీ) ఆరో తరగతిలో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు గడువు ఆగస్టు 15వ తేదీకి పొడగించినట్లు విశాఖ జిల్లా విద్యాశాఖాధికారి లింగేశ్వరరెడ్డి తెలిపారు. apkgbv.apcfss.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలన్నారు.

బీసీ, ఓసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ ,ఎస్టీ విద్యార్థులు రూ.50 చలానా చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఇతర వివరాలకు 9494888617, 9441270099 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు. 

HMTV

HMTV

Next Story