కార్మిక చట్టాలను పటిష్ఠం చేయాలని ధర్నా

HMTV
By HMTV
Published on: 2020-07-23 16:10:54

మాడుగుల: నియోజకవర్గంలోని మాడుగుల, దేవరాపల్లి, కె.కోటపాడు, చీడికాడ మండలాల్లో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రైతులు, కూలీలు, కార్మికులు ఆందోళన చేశారు. ప్రజలందరికీ ఉచిత విద్య, ఆరోగ్య సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

ఉపాధి హామీ పథకం కూలీలకు 200 రోజులు పని కల్పించి, రూ.600 రోజువారి కూలి అందించాలని.. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకన్న కోరారు. పెట్రోలు, డీజిలు ధరలను తగ్గించాలని, భూ యజమానికి సంబంధం లేకుండా కౌలు రైతులకు గుర్తింపు కార్డులను మంజూరు చేయాలని, డిమాండ్ చేశారు.

HMTV

HMTV

Next Story