నేడు రాజ్యసభ సభ్యుల ప్రమాణం

HMTV
By HMTV
Published on: 2020-07-22 03:38:30

ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన నలుగురు సభ్యులు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నాలుగు రాజ్యసభ పభ్యుల్లో అనూహ్యంగా మోపిదేవి. చంద్రబోస్ తెరపైకి వచ్చారు. వాస్తవంగా వీరు శాసన మండలి సభ్యులు కాగా, మంత్రులుగా నియమించారు. అయితే వికేంద్రీకరణ బిల్లును వ్యతిరేకించడంతో శాసనమండలి రద్దుకు సిఫార్సు చేస్తూ ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో వీరిద్దరికీ సభ్యత్వం రద్దవుతుందనే కారణంగా రాజ్యసభకు పంపించారు.

అయితే తరువాత మరికొంత మందిని శాసనమండలికి వైఎస్ జగన్ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ విధంగా వీరు రాజ్యసభకు ఎన్నిక కాగా మరో ఇద్దరు అయోద్య రామిరెడ్డి, పరిమళ్ సత్వానీలను రాజ్యసభకు ఎంపిక చేశారు. అయితే వీరిలో ఈ రోజు రామిరెడ్డి ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధంకాగా మరో ఎంపీ సత్వానీ వ్యక్తిగత కారణాల వల్ల వాయిదా వేసుకున్నారు.


HMTV

HMTV

Next Story