జైలులో వరవర రావుకు కరోనా పాజిటివ్!

HMTV
By HMTV
Published on: 2020-07-16 13:19:02

కొన్ని నెలల నుంచి ముంబైలోని జైలులో ఉంటున్న విప్లవ రచయితల సంఘం నాయకుడు వరవరరావుకు కరోనా సోకింది. ప్రస్తుతం నేవీ ముంబైలోని జేజే ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. కొద్దిరోజుల నుంచి ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాలని కుటుంబసభ్యులు మహారాష్ట్ర ప్రభుత్వం, పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటీవల ఆయనను జేజే ఆస్పత్రికి తరలించిన జైలు సిబ్బంది... త్వరలోనే ఆయనను సెయింట్ జార్జ్ ఆస్పత్రికి తరలించే అవకాశం ఉందని తెలుస్తోంది.

వృద్ధాప్యంలో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వరవరరావును కేంద్ర ప్రభుత్వం తప్పుడు కేసుల్లో ఇరికించారని... ఆయనను అమానుషంగా జైలులో నిర్బంధించిందని కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తాత్కాలిక బెయిల్‌ కోసం వరవరరావు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. 

HMTV

HMTV

Next Story