ఏపీలో ఎంసెట్ సహా అన్ని కామన్ ఎంట్రెన్స్ పరీక్షలు వాయిదా!

HMTV
By HMTV
Published on: 2020-07-13 13:57:11

ఏపీలో ఎంసెట్ సహా అన్ని కామన్ ఎంట్రెన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఎంసెట్ ఈసెట్, ఐసెట్ సహా ఎనమిది సెట్ల పరీక్షలను వాయిదా వేస్తున్నట్లుగా విద్యాశాఖమంత్రి అదిమూలపు సురేష్ ప్రకటించారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత కొత్త పరీక్షల తేదీలను ప్రకటిస్తామని అయన వెల్లడించారు. అంచనా ప్రకారం సెప్టెంబర్ మూడవ వారంలో ఎంసెట్ పరీక్ష జరిగే అవకాశం ఉందని అన్నారు.

HMTV

HMTV

Next Story