అంబేద్కర్ గృహంలో వస్తువులను ధ్వంసం చేసిన వారిని శిక్షించాలి...

HMTV
By HMTV
Published on: 2020-07-10 10:33:50

వజ్రకరూరు: తహశీల్దార్ కార్యాలయం వద్ద గల బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మొలక రామాంజీనేయులు అధ్వర్యంలో బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ నాయకులతో కలసి నిరసన తెలిపారు.

- దేశ ఆర్థిక రాజధాని ముంబాయి మహానగరంలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజగృహంలోని పూలకుండీలు, కీటీకీలు, సీసీ కెమెరాలు ఇతరత్రా వస్తువులను ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మొలక రామాంజీనేయులు డిమాండ్ చేశారు.

- ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బెంజమిన్, రామాంజీనేయులు, కోదండరాముడు తదితరులు పాల్గొన్నారు.



HMTV

HMTV

Next Story