పొలం బాటలో ఎమ్మెల్యే జక్కంపూడి

HMTV
By HMTV
Published on: 2020-07-08 10:19:07

కోరుకొండ: మండలం గాడాల - నిడిగట్ల గ్రామాల మధ్య రాజానగరం శాసనసభ్యులు, కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా రైతు దినోత్సవ వేడుకను నిర్వహించి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

- ఈ సందర్భంగా ఆయన రాజశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావుల విగ్రహాలకు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని తానే స్వయంగా సేద్యం చేస్తున్న వరి పొలంలో వ్యవసాయ కూలీలతో ఆయన వరి నారును పీకి కట్టలు కట్టి వరి నాట్లు వేసి రైతులకు మార్గదర్శిగా నిలిచారు.

- ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నేలమట్టం చేసిందని ఆరోపించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవసాయం దండగ అందని, వ్యవసాయ రంగాన్ని ప్రస్తుత జగనన్న ప్రభుత్వం వ్యవసాయం దండగ కాదు పండగ అని నిరూపిస్తున్నారు.

- జగనన్న పాదయాత్రలో భాగంగా వేల కిలోమీటర్లు నడిచి ప్రజల యొక్క యోగక్షేమాలు తెలుసుకుని వారికి కావలసిన ప్రతి అవసరాన్ని తీర్చడానికి కంకణం కట్టుకున్నారని తెలిపారు. 




HMTV

HMTV

Next Story