లబ్దిదారులకు పారదర్శకంగా ఇళ్ళపట్టాల ఎంపిక

HMTV
By HMTV
Published on: 2020-07-06 02:01:18

నరసరావుపేట: పట్టణంలో మరో రెండు రోజుల్లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్న నేపథ్యంలో ఇళ్ల పట్టాలకై నమోదు చేసుకున్న లబ్ధిదారులకు స్థలాలు కేటాయింపులో ముందు వెనుక అనే

తారతమ్యం లేకుండా లాటరీ ద్వారా ఎంపిక చేసి ఇళ్లను, ఇంటి స్థలాన్ని కేటాయించటం పారదర్శక పరిపాలనకు నిదర్శనం అని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు.

- ఈ సందర్భంగా నరసరావుపేట భువనచంద్ర టౌన్ హాల్ లో లాటరీ ద్వారా ఎంపిక కార్యక్రమాన్ని నరసరావుపేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు.

- ఎమ్మెల్యే గోపి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు.

- ఈ కార్యక్రమంలో ఆర్డీవో మొగిలి వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ కె వెంకటేశ్వరరావు, తహాసీల్దార్ రమణ నాయక్, హౌసింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.




HMTV

HMTV

Next Story