స్వదేశీ తయారీ రంగానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలి : కేటీఆర్‌

HMTV
By HMTV
Published on: 2020-07-04 12:36:09

సీఐఏ ఆధ్వర్యంలో జరిగిన వెబినార్‌లో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వదేశీ తయారీ రంగానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. అన్ని రంగాలపై కొవిడ్‌ ప్రభావం పడిందన్న మంత్రి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే పనులు కొనసాగుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే సీఐఏకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామన్నారు. సంక్షేమం, అభివృద్ధి ప్రాధాన్యతలుగా ప్రభుత్వ పాలన కొనసాగుతోందన్నారు. ఎక్స్‌కాన్‌ వంటి కార్యక్రమాలను సీఐఏ హైదరాబాద్‌లో నిర్వహించాలని కోరారు.

HMTV

HMTV

Next Story