కారును ఢీకొన్న కంటైనర్, నలుగురి మరణం

HMTV
By HMTV
Published on: 2020-07-03 03:00:22

అన్ లాక్ లో సైతం ప్రయాణాలు వేగంగా జరుగుతున్నాయనే దానికి ఇదే నిదర్శనం. లాక్ డౌన్ దాదాపుగా మూడు నెలల తరువాత ప్రయాణాలన్నీ ఒక్కసారే ప్రారంభం కావడంతో ఇలా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. గుంటూరు వద్ద జరిగిన ప్రమాదంలో నలుగురు మరణించడం దారుణంగా చెప్పవచ్చు.

నరసరావుపేట నుంచి చిలకలూరిపేట మీదుగా విజయవాడ వెళ్తున్న కారును గుంటూరు నుంచి చిలకలూరిపేట వైపు వెళుతున్న కంటైనర్‌ లారీ బుధవారం అర్ధరాత్రి యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జుకాగా.. అందులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు చనిపోయారు.

నరసరావుపేటకి చెందిన మేడసాని వెంకట శ్రీచంద్‌ (25), ఇనుమెట్ల గ్రామానికి చెందిన అత్తులూరి బలరాం(27) అక్కడికక్కడే చనిపోగా..గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ నరసరావుపేటకి చెందిన వింజమూరి హరికృష్ణ (27), షేక్‌ ఫిరోజ్‌ అహ్మద్‌(26) మృతిచెందారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.



HMTV

HMTV

Next Story