ఈరోజు జాతినుద్దేశించి ప్రసంగించానున్న ప్రధాని

HMTV
By HMTV
Published on: 2020-06-30 02:43:09

నేటి సాయంత్రం జాతి నుద్దేశించి ప్రసంగించనున్న మోడీ దేనిపై మాట్లాడాతారనే దానిపై ఇంకా స్పష్టత కనిపించడం లేదు. ఒక పక్క చైనా చర్యలు గురించి చర్చ జరుగుతుండగా, మరో పక్క దేశంలో కరోనా కేసులు మరింత తీవ్రరూపం దాల్చడంతో దీనిపై కఠిన నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై చర్చించుకుంటున్నారు. ఏ విషయమై ఆయన మాట్లాడినా ఈ రోజు జాతినుద్దేశించి ప్రసంగించడం తప్పనిసరని పీఎంవో కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది.

ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సాయంత్రం 4 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసగించనున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. భారత్-చైనా మధ్య నెలకొన్న పరిస్థితులపై ఆయన ప్రసంగం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం భారత్-చైనా దేశాల కమాండర్ల స్థాయి చర్చలు జరుగుతున్న తరుణంలో మోదీ ప్రసంగిస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. దానికి తోడు ఇవాళ 59 చైనా యాప్‌లను భారత ప్రభుత్వం బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకోగా మంగళవారం ప్రధాని ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

HMTV

HMTV

Next Story