నేరాల నియంత్రణకు దాతల సహకారంతో సీసీ కెమెరాల ఏర్పాట్లు

HMTV
By HMTV
Published on: 2020-06-27 02:29:53

సిద్ధవటం: మండలం భాకరాపేట గ్రామానికి చెందిన వ్యాపారస్తుల సహకారంతో ప్రధాన హైవే రోడ్డు లోని ప్రధాన కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నామని ఎస్ఐ రమేష్ బాబు తెలిపారు.

- భాకరాపేట ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేయనున్న ఈ సిసి కెమెరాల వల్ల కొంతవరకు నేరాలు నియంత్రించవచ్చన్నారు.

- ఎందుకంటే నేరాలు ప్రమాదాలు జరిగినప్పుడు ముద్దాయిలు వాహనాలు తప్పించుకు పోతున్నాయని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంవల్ల ఆధారాలు సేకరించి తప్పించుకొని పోయిన వాహనాలను ముద్దాయిలను పట్టుకొని కేసులు నమోదుచేసి, చట్టరీత్యా చర్యలు తీసుకున్నట్లయితే భవిష్యత్తులో కొంతవరకు నేరాల నియంత్రణ అదుపులోనికి వస్తుందని ఆయన తెలిపారు.



HMTV

HMTV

Next Story