యథావిధిగా ఆర్టీసీ సర్వీసులు

HMTV
By HMTV
Published on: 2020-06-25 02:21:20

- రాజమహేంద్రవరం: జిల్లాలోని ఆయా డిపోల నుంచి బస్సు సర్వీసులు యథావిధిగానే నడుస్తాయి.

- జిల్లా అంతటా గురువారం నుంచి లౌక్‌డౌన్‌ అమలు చేసేందుకు జిల్లా కలెక్టర్‌ నిర్ణయించినప్పటికీ తర్వాత దానిని కంటైన్మెంట్, బఫర్‌ జోన్‌లకు మాత్రమే పరిమితం చేయడంతో జిల్లాలో ప్రస్తుతం తిరిగే రూట్లలో ఆర్టీసీ సర్వీసులను యథావిధిగానే తిప్పేందుకు అధికారులు నిర్ణయించారు.

- జిల్లాలో తొమ్మిది డిపోల నుంచి మొత్తం 286 సర్వీసులను నడపనున్నట్లు ఆర్టీసీ ఆర్‌ఎం ఆర్‌వీఎస్‌.నాగేశ్వరరావు తెలిపారు.

- అమలాపురం డిపో నుంచి 45 సర్వీసులు, రాజమహేంద్రవరం నుంచి 58, కాకినాడ నుంచి 62, గోకవరం నుంచి 22, రావులపాలెం నుంచి 20, రాజోలు నుంచి 14, ఏలేశ్వరం నుంచి 20, రామచంద్రపురం నుంచి 15, తుని నుంచి 30 సర్వీసులు చొప్పున నడపనున్నారు.  




HMTV

HMTV

Next Story